– టిఫిన్ల రేట్లు ఐదు నుండి పది రూపాయలు పెంపు
నవతెలంగాణ-మద్నూర్ : సిలిండర్ల గ్యాస్ కొరత పేరుతో టిఫిన్ సెంటర్ల యజమాన్యాలు ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను టిఫిన్ సెంటర్లో యజమాన్యాలు బేకాతర్ చేస్తూ ఐదు రూపాయల నుండి పది రూపాయలు పెంచి టిఫిన్లు అమ్ముతున్నారు. ఇలాంటి అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మద్నూర్ మండల ప్రజలు కోరుతున్నారు. కమర్షియల్ సిలిండర్లు వాడకుండా బ్లాకులో సిలిండర్లను 2000 నుండి 2500 రూపాయల వరకు కొనుగోలు సాకుతో టిఫిన్ల రేట్లు పెంచి అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కొక్క టిఫిన్ పై ఐదు రూపాయల నుండి పది రూపాయలు పెంచినట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధిక ధరలతో అమ్మే టిఫిన్ సెంటర్ల యజమాన్యాలపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు చేపట్టి మోసాలు జరగకుండా బ్లాకులో ఇండ్లలో వాడుకునే సిలిండర్లు కొనుగోలు జరపకుండా చూడాలని మండల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు టిఫిన్ సెంటర్ల యజమాన్యాలు బేకాతర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



