Wednesday, November 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపత్తి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వానిది రైతు వ్యతిరేక నిర్ణయం

పత్తి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వానిది రైతు వ్యతిరేక నిర్ణయం

- Advertisement -

 – కిసాన్ కపాస్ పేరుతో రైతులను దోపిడీ చేస్తున్న మోడీ సర్కార్

 – పత్తి కొనుగోలు నుంచి సిసిఐ తప్పుకునే ప్రయత్నం

 – తడిసిన, నేలకొరిగిన పంటను నష్టపరిహారాన్ని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

   – సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య

నవతెలంగాణ – భువనగిరి

కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు విషయంలో ఎకరాకు ఏడు క్వింటాలు మాత్రమే కొంటామని ప్రకటించడం దారుణమని కిసాన్ కపాస్ పేరుతో రైతులను దోపిడీ చేయాలని చూస్తుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. బుధవారం స్థానిక సుందరయ్య భవనంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలకు హద్దు అదుపు లేకుండా పోతుందని, ఆరుకాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట రంగు మారి రైతులకు తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా పూర్తిస్థాయిలో తేర్చుకోలేదు పైగా కేంద్ర ప్రభుత్వం మాత్రం సిసిఐ ద్వారా ఎకరాకు ఏడు కింటాలు మాత్రమే కొనుగోలు చేస్తాం అనడం రైతు నడ్డి విరచడం తప్ప మరొకటి కాదని వారు అన్నారు. ఈ చర్యల వల్ల దేశంలో ఉన్న 50 లక్షల మంది పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కనీసం తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు ఎంపీలు దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని వారు ప్రశ్నించారు. ఇది కాక కేంద్రం విధించిన నిబంధన సమర్థిస్తూ కిషన్ రెడ్డి ప్రకటన చేయడం బిజెపి రైతు వ్యతిరేక ప్రభుత్వమని స్పష్టంగా అర్థం అవుతుంది అని వారన్నారు.

కొనుగోల నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ను తప్పించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు ఉంటున్నాయన్నారు. పత్తి పంటకు నష్టం జరిగిందని తెలియగానే విదేశీ దిగుమతులపై 11 శాతం సుంకాలు  ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దీని ఫలితంగా స్వదేశీ పత్తికి ధర లేకుండా పోయిందన్నారు. విదేశీ దిగుమతుల మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడిందని వారు అన్నారు.  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షం కారణంగా లక్షల క్వింటాళ్ల ధాన్యం తడిసిందన్నారు. వేల ఎకరాల వరి పంట నేలకొరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని అంచనా వేసి రైతులకు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నదన్నారు. ఎకరాకు పది వేల రూపాయలు మాత్రమే ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంతా చూస్తుంటే ఈ రెండు ప్రభుత్వాలు ఏ రకంగా రైతు ప్రభుత్వాలు అవుతాయని వారు ప్రశ్నించారు.  సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారికి కోటి రూపాయలు గాయపడిన వారికి పది లక్షలు ఇస్తామన్నా ప్రకటించిన ఇంకా అమలు కాలేదని  గుర్తు చేశారు.

ఇప్పటివరకు ప్రమాదానికి కారణమైన ఎవరి మీద చర్యలు తీసుకోలేదని వారు అన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు, గాయపడిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్గ్రేషియా ప్రకటించలేదని  అన్నారు. వెంటనే పత్తి కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో తడిసిన ధాన్యానికి నేలకొరిగిన పంటలకు నష్టపరిహారం అంచనా వేసి వెంటనే పరిహారాన్ని అందించాలని  డిమాండ్ చేశారు.

ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు అకాల వర్షంతో వేల ఎకరాల పంట నీటిలో కొట్టుకుపోయిన ఇప్పటివరకు అధికారులు పంట నష్టం పై ఇలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. జిల్లాలో ప్రధాన రహదారులు గుంతల మయంగా మారి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్ అండ్ బి అధికారులు వెంటనే రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలోరాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య, బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసాచారి, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, బొల్లు యాదగిరి, మద్దెల రాజయ్య ఎండి పాషా బొడ్డుపల్లి వెంకటేష్, ఎం యాదయ్య, గుండు వెంకటనర్సు గంగదేవి సైదులు మద్దేపురం రాజు, బోలగాని జయరాములు, అవ్వారు రామేశ్వరి, రాచకొండ రాములమ్మ, ఎంఎ ఇక్బాల్, వనం ఉపేందర్, గడ్డం వెంకటేష్, మల్లేపల్లి లలిత, గోషిక కరుణాకర్, గణపతిరెడ్డి  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -