Tuesday, December 2, 2025
E-PAPER
Homeజాతీయంకేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..PMO పేరు మార్పు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..PMO పేరు మార్పు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గవర్నర్ల అధికారిక నివాసాల పేర్లను ఇటీవల మార్చిన సంగతి తెలిసిందే. ఇదివరకు గవర్నర్ల అధికారిక నివాసాల పేర్లు ‘రాజ్ భవన్’ గా ఉండగా.. వాటిని ‘లోక్ భవన్’ గా మార్చింది. అయితే గవర్నర్ల అధికారిక నివాసాలు మాత్రమే కాకుండా నేడు ప్రధానమంత్రి కార్యాలయం పేరును కూడా మారుస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ. ప్రధాని కార్యాలయం పేరు ఇది వరకు పీఎంఓ అని ఉండగా.. దానిని ‘సేవాతీర్థ్’ గా మార్చింది. అయితే అయితే ఆయా పేర్లు బ్రిటిష్ వలసవాదాన్ని సూచిస్తున్నాయని అందుకే ప్రజాస్వామ్యాన్ని సూచించే పేర్లలోకి మార్చమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా.. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మాత్రం కేంద్ర ప్రభుత్వ చర్యను పూర్తిగా వ్యతిరేకించాయి. ఈ నిర్ణయంలో రాష్ట్రాల జోక్యం లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాయని మండి పడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -