Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువిమాన ప్రమాదానికి కేంద్రం బాధ్యత వహించాలి: ఖర్గే

విమాన ప్రమాదానికి కేంద్రం బాధ్యత వహించాలి: ఖర్గే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు.విమాన ప్ర‌మాదంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ మృత్యుంజ‌యుడు విశ్వస్‌కుమార్ రమేష్‌ను ఆయ‌న‌ కలిశారు. ఈ త‌ర్వాత‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ..”ఈ విమాన ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా పరిహారం ప్రకటించలేదు. అహ్మదాబాద్ నగరం ఈ భయంకరమైన ప్రమాదాన్ని ఎప్పటికీ మరచిపోదు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా వైద్యం అందించాలని వైద్యులను కోరాం. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలతో మిగలడం అద్భుతం. వీలైనంత త్వరగా ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలు రెండు రోజులుగా బాధితులకు సహాయం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఏవైన ఘటనలు జరిగితే ఇలాగే సాయం చేస్తారు. బాధితులకు మందులు లేదా మరేదైనా అవసరమైతే.. అవి స్థానికంగా అందుబాటులో లేకపోతే, మా పార్టీ కార్యకర్తలు దానిని ఏర్పాటు చేస్తార‌ని ఆయ‌న తెలిపారు” అని ఆయన అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad