నవతెలంగాణ-హైదరాబాద్ : సమగ్ర మల్టీవిటమిన్ మద్దతులో ప్రజాదరణ పొందిన సెంట్రమ్, నేడు పోటీతో కూడిన ఎనర్జీ డ్రింక్ మిక్స్ విభాగంలోకి సెంట్రమ్ రీఛార్జ్ విడుదలతో దాని ఉత్పత్తి శ్రేణిని విస్తరించించామని ప్రకటించింది. ఈ వినూత్న ఉత్పత్తిని వినియోగదారులు రోజువారీ కార్యకలాపాల సమయంలో కోల్పోయిన, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను తిరిగి భర్తీ చేసేందుకు వీలుగా తయారు చేశారు. ఇది శక్తిని, రోగనిరోధక శక్తిని, శరీరానికి కావలసిన నీటిని అందించేందుకు మద్దతు ఇస్తుంది.
చాలామంది ఎలక్ట్రోలైట్ నష్టం గురించి మాట్లాడుతుంటారు. వాస్తవం ఏమిటంటే, మన శరీరం నిత్యం విటమిన్లు, ఖనిజాలను కూడా కోల్పోతుంది. దీంతో మనం అలసిపోతాము. ఎలక్ట్రోలైట్‌లను పునరుద్ధరించడానికి అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. కానీ, విటమిన్లను, ఖనిజాలను తిరిగి నింపాల్సిన అవసరం కూడా అంతే అవసరం. దాని కోసం బి విటమిన్లు, విటమిన్ సి, మెగ్నీషియం, జింక్ వంటి విటమిన్లు, ఖనిజాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇక్కడే సెంట్రమ్ రీఛార్జ్ కీలక పాత్ర పోషిస్తుంది. బి విటమిన్లు, విటమిన్ సి, మెగ్నీషియం, జింక్‌తో సహా 13 ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలతో దీన్ని తయారు చేశారు. ఇవన్నీ శక్తి స్థాయిలను, రోగనిరోధక పనితీరును సమర్ధించడంతో పాటు హైడ్రేషన్‌ను నిర్వహించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. సెంట్రమ్ రీఛార్జ్ మార్కెట్‌లోని ప్రముఖ మల్టీవిటమిన్ ఎనర్జీ డ్రింక్ పానీయాల సంకలనాలు, మిక్సర్‌ల కన్నా 2 రెట్లు ఎక్కువ విటమిన్లను, ఖనిజాలను కలిగి ఉంది. దీనిలో ఎటువంటి చక్కెర లేదు. ఇది వినియోగదారులకు పోషకమైన ఎంపికగా ఉంటుంది.
ఈ ఉత్పత్తి ఇండివిడ్యువల్ సాచెట్‌లలో ప్యాక్ అయి, ప్రయాణంలో వినియోగానికి అనువుగా ఉంటుంది. కొత్త ఆవిష్కరణ గురించి హాలియన్ ఐఎస్‌సిలోని విటమిన్ అండ్ మినరల్ సప్లిమెంట్స్ కేటగిరీ లీడ్ – విటమిన్ అండ్ మినరల్ సప్లిమెంట్స్, అతిష్ నేగి మాట్లాడుతూ, “సెంట్రమ్ రీఛార్జ్‌ను మా సెంట్రమ్ ఇండియా పోర్ట్‌ఫోలియోకు జోడించడానికి మేము సంతోషిస్తున్నాము. సెంట్రమ్ రీఛార్జ్ అనేది శక్తి, హైడ్రేషన్కు పోషకమైన పరిష్కారంగా, ముఖ్యమైన అవసరాన్ని తీరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము- ఇది నేటి వినియోగదారుల చురుకైన జీవనశైలికి అనుగుణంగా ఉంటుంది. సెంట్రమ్ రీఛార్జ్ కేవలం ఎనర్జీ డ్రింక్ మిశ్రమం మాత్రమే కాదు. ఇది రోజువారీ ఆహారంతో పాటు తీసుకున్నప్పుడు శక్తి, రోగనిరోధక శక్తి, హైడ్రేషన్‌కు మద్దతు ఇవ్వడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. సాధారణంగా అనేక పోటీ ఉత్పత్తులలో ఉండే అదనపు చక్కెరలు లేకుండా దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చాము. వివిధ రకాల వినియోగదారుల సూక్ష్మపోషక అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని జాగ్రత్తగా తయారు చేశాము. ఇది పిల్లలకు మరియు పెద్దలకు 2 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది’’ అని వివరించారు.
దీన్ని ఘనంగా విడుదల చేసేందుకు, బాలీవుడ్ నటి మరియు బ్రాండ్ అంబాసిడర్ అనుష్క శర్మతో కలిసి సమగ్ర మల్టీమీడియా క్యాంపెయిన్‌ను సెంట్రమ్ అభివృద్ధి చేసింది. ఈ ప్రచార చిత్రాలలో వ్యక్తులు వారి రోజువారీ దినచర్యల సమయంలో శక్తి తగ్గుదలలను అనుభవించే సంబంధిత దృశ్యాలు, సెంట్రమ్ రీఛార్జ్ వారి శక్తి స్థాయిలను తిరిగి నింపడాని, మరింత చురుకుగా వారిని చేయడంలో వారికి ఎలా సహాయపడుతుంది అనేవి ఉన్నాయి. ‘‘మన శరీరం ప్రతిరోజూ విటమిన్లను, ఖనిజాలను కోల్పోతుంది. దీంతో మనకు అలసట కలుగుతుంది. ఇప్పుడు సెంట్రమ్ రీఛార్జ్‌తో దాన్ని తిరిగి పొందండి!’’ అనే వాస్తవం చుట్టూ క్యాంపెయిన్ కొనసాగుతుంది. సెంట్రమ్ రీఛార్జ్ అనేది శక్తి, రోగనిరోధక శక్తి మరియు హైడ్రేషన్‌కు మద్దతు ఇవ్వడానికి 13 విటమిన్లు, ఖనిజాలతో నిండిన ప్రయాణంలో ఉన్న అనుకూలమైన పరిష్కారం.
అనుష్క శర్మ మాట్లాడుతూ, “సెంట్రమ్ కుటుంబంలో భాగమైనందుకు, సెంట్రమ్ రీఛార్జ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. చురుకైన జీవనశైలిని నడిపించే వ్యక్తిగా, శక్తి స్థాయిలను నిర్వహించడం, అవసరమైన పోషకాలను తిరిగి నింపవలసిన ప్రాముఖ్యతను నేను అర్థం చేసుకున్నాను. శక్తివంతంగా, హైడ్రేటెడ్‌గా ఉండేందుకు పోషకమైన మార్గాన్ని కోరుకునే వ్యక్తులకు సెంట్రమ్ రీఛార్జ్ సహాయపడుతుంది’’ అని తెలిపారు.
ఈ క్యాంపెయిన్ డిజిటల్, ఆఫ్‌లైన్, యాక్టివేషన్స్, స్పోర్ట్స్ మరియు ఫిట్‌నెస్ యాక్టివేషన్స్ మొదలైన విభిన్న శ్రేణి ప్లాట్‌ఫామ్‌లను, ఛానెళ్లను కలిగి ఉంటుంది. సెంట్రమ్ రీఛార్జ్ ఆరెంజ్ ఫ్లేవర్‌లో అందుబాటులో ఉంటుంది. భారతదేశం వ్యాప్తంగా, సమీపంలోని ఫార్మసీలు, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్‌లు మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ₹10 ధరతో (5గ్రా) అందుబాటులో ఉంటుంది.