- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: ఏనుగు దాడిలో ఒక సంపన్న సీఈఓ ప్రాణాలు కోల్పోయారు. ఆయన దక్షిణాఫ్రికాలో విలాసవంతమైన గోండ్వానా ప్రైవేటు గేమ్ రిజర్వ్‌కు సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఏనుగును పక్కకు తోలుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తుంది. దక్షిణాఫ్రికా ఎకోటూరిజంలో అందరికీ సుపరిచితులైన గేమ్ రిజర్వ్ సీఈఓ ఎఫ్‌సీ కాన్రాడీ (39) రోజూలాగే కార్యకలాపాలు పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
టూరిస్టు లాడ్జిలకు దూరంగా ఏనుగుల గుంపును తోలుతుండగా.. ఒకటి మాత్రం విపరీతంగా ప్రవర్తించింది. తన దంతాలతో నెట్టి, పలుమార్లు తొక్కిందని, పక్కనే ఉన్న రేంజర్లు కాన్రాడీని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వెల్లడించారు.
- Advertisement -