శివ కందుకూరి హీరోగా ‘చాయ్ వాలా’ అనే చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్.పాపుడిప్పు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహిస్తున్నారు.
శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో శివ కందుకూరి, రాజీవ్ కనకాల స్కూటీపై జాలీగా తిరుగుతూ కనిపిస్తున్నారు. ‘ఈ కథ ప్రేమ, వారసత్వం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. ఓ పర్ఫెక్ట్ చాయ్, కప్పులా ఉంటుంది. భావోద్వేగాలు, సంప్రదాయం, కలలతో నిండిన అద్భుతమైన ప్రయాణాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి. టీజర్ అతి త్వరలో వస్తుంది’ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం సమకూరుస్తుండగా, క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ నర్వా ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘శివ కందుకూరి ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన నటిస్తున్న మరో భిన్న కాన్సెప్ట్ చిత్రమిది. ఈ సినిమా తప్పకుండా విశేష ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అని మేకర్స్ తెలిపారు.
భిన్న కాన్సెప్ట్‌తో ‘చాయ్ వాలా’
- Advertisement -
- Advertisement -