Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సాహిత్యానికి సుద్దాల పెద్దపీట 

ప్రజా సాహిత్యానికి సుద్దాల పెద్దపీట 

- Advertisement -

సుద్దాల హనుమంతు వర్ధంతిలో కవులు
నవతెలంగాణ – వనపర్తి 

 ప్రజా సాహిత్యానికి పాదులు వేస్తూ సాహిత్య లోకానికి పెద్దపీట వేసిన ప్రజా కవి సుద్దాల హనుమంతు అని కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మహనీయుల స్ఫూర్తి వేదిక రాజారాం ఆధ్వర్యంలో ప్రజాకవి సుద్దాల హనుమంతు వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుద్దాల హనుమంతు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవి పండితుడు గిరిరాజాచారి, రాజా రామ్ ప్రకాష్ లు మాట్లాడారు. సుద్దాల హనుమంతు 1910 జూన్ లో జన్మించి, 1982 అక్టోబర్ 10న మరణించారని తెలిపారు. సుద్దాల హనుమంతు ప్రజల బాణిలో పాటలు రాసి ప్రజా సాహిత్యానికి పాదులు వేశారన్నారు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తన పాటలతో ప్రజలను చైతన్యం చేసిన ప్రజాకవి అన్నారు. ఆనాటి నిజాంకు, దొరలకు భూస్వాముల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పాటలు రాసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కవి సుద్దాల హనుమంతు అన్నారు, ‘పల్లెటూరి పిల్లగాడ’ అనే పాట ఆయన కలం నుండి జాలువారి పసిపిల్లల దుర్భర జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించారన్నారు. ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ సుద్దాల హనుమంతు కుమారుడు, సుద్దాల హనుమంతు ఫౌండేషన్ ను 2010 అక్టోబర్ 13న స్థాపించి కొనసాగిస్తున్నారని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -