– ముగిసిన ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ టోర్నీ
హైదరాబాద్: గుత్తా జ్వాల అకాడమీలో జరిగిన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గురువారం ఘనంగా ముగిసింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య శర్మ (పంజాబ్)పై జిన్‌పాల్ (ఢిల్లీ) 21-19, 17-21, 22-20తో గెలుపొందగా.. మహిళల సింగిల్స్ ఫైనల్లో మాన్షి సింగ్ (ఉత్తరప్రదేశ్)పై రుజుల రాము (కర్ణాటక) 9-21, 21-18, 21-18తో విజయం సాధించింది. మెన్స్ డబుల్స్ ఫైనల్లో ఆమన్, సింగ్ (రాజస్థాన్) జోడీ 21-18, 21-19తో దీప్, ప్రతీక్ (మహారాష్ట్ర)లపై గెలుపొందారు. మహిళల డబుల్స్ ఫైనల్లో అమృత, సోనాలి జంట 21–2, 20-22, 21-12తో దియ, బారునిలపై పైచేయి సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్ రెడ్డి, రాధిక శర్మలు నితిన్, రితికలపై 21-15, 21-10తో గెలుపొంది విజేతలుగా నిలిచారు. పరిగి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి, టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి గుత్తా క్రాంతిలు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
చాంప్స్ సాత్విక్, రాధిక జోడీ
- Advertisement -
- Advertisement -