- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: 20 ఏళ్ల పాటు హైదరాబాద్‌తో చంద్రబాబుకు సంబంధమే లేదని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. హైటెక్ సిటీకి నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ శంకు స్థాపన చేయగా హైటెక్ సిటీ అభివృద్ధి తన వల్లేనంటూ బీరాలు పలుకుతున్నారని ఆరోపించారు.
తాడేపల్లి నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి పాలన, చంద్రబాబు వ్యవహారశైలీపై విరుచుకుపడ్డారు. 2003-04లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే హైదరాబాద్‌లో నిజమైన అభివృద్ధి మొదలైందని పేర్కొన్నారు. కేసీఆర్ ( KCR ) రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడంతో హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందిందని ప్రశంసించారు.
- Advertisement -