Sunday, May 18, 2025
Homeతెలంగాణ రౌండప్‘చంద్రభాగ’ పుస్తక పరిచయ సభ

‘చంద్రభాగ’ పుస్తక పరిచయ సభ

- Advertisement -


నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయంలో అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి అధ్యక్షతన ‘సాహిత్య వారం’ కార్యక్రమంలో ప్రముఖ కథా రచయిత, అనువాదకులు డా. రూప్ కుమార్ డబ్బీకార్ అనువదించిన జ్ఞానపీఠ్ పురష్కార గ్రహీతల కథల అనువాద సంకలనం “చంద్రభాగ ” పుస్తక పరిచయ సభ జరిగింది . ఈ సభలో పూర్వ రిజిస్ట్రార్, తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ‌రిజిస్ట్రార్ ప్రముఖ విమర్శకులు ఆచార్య టి. గౌరీశంకర్ పుస్తక పరిచయం చేస్తూ కథల్లోని సామాజిక, వైయక్తిక, రాజకీయ వైరుధ్యాలు ఏ విధంగా వ్యవస్థలను , మనిషిని సంఘర్షణకు గురిచేస్తున్నాయో సునిశితంగా వివరించారు. అనువాదాల్లో వున్న కథా శిల్పం, భాష, శైలి, రూప్ కుమార్ అనువదించిన తీరును, ప్రతిభను దర్శిoపజేస్తున్నాయని చెప్పారు. ప్రముఖ విమర్శకులు సీ.ఎస్.రాంబాబు కథల ఎన్నిక, వస్తువు గురించి మాట్లాడుతూ అనువాదాల్లోని వాక్యాలు చాలాచోట్ల కవితాత్మకంగా ఉంటూ పాఠకుణ్ణి కట్టిపడేస్తాయి అన్నారు . డా. నామోజు బాలాచారి అధ్యక్షోపన్యాసం చేస్తూ తెలంగాణ సాహిత్య అకాడమి, ప్రామాణికమైన తెలంగాణ సాహిత్య గ్రంథాల ప్రచురణ బాధ్యతలను తీసుకోవడమే గాక ఆ గ్రంథాలను సాహిత్య రంగానికి పరిచయం కూడా చేస్తూ కవులకు, రచయితలకు సహకరిస్తున్నదని చెప్పారు. ఆ దిశగానే “చంద్రభాగ ‘ ప్రచురించిందని ఇందులోని అనువాద కథలు ప్రశస్తంగా ఉన్నాయని చెప్పారు. అనంతరం రచయిత రూప్ కుమార్ డబ్బీకార్ తమ స్పందనను తెలిపారు. తిరుపాల్ వందన సమర్పణ చేశారు. సభలో ప్రముఖ కవులు , రచయితలు, నాళేశ్వరం శంకరం, కటుకోజ్వల ఆనందాచారి, ఆడెపు లక్ష్మీపతి , గుడిపాటి , కందుకూరి శ్రీరాములు , హనీఫ్, ఒద్దిరాజు ప్రవీణ్ , వాహెద్ , రంగరాజు పద్మజ, తంగిరాల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -