చండూరు అభివృద్ధి ఇంకా 90 శాతం మిగిలి ఉంది
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నవతెలంగాణ – చండూర్
చండూర్ మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, 10 శాతమే అభివృద్ధి చెందిందని ఇంకా 90% అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మునుగుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపల్ పట్టణంలో స్థానిక చౌరస్తాలో 30 కోట్ల వ్యయంతో నిర్మించిన బటర్ఫ్లై లైట్లను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అంతా వెనుకబడిపోయింది అన్నారు. 2018లో రాష్ట్ర మొత్తం టిఆర్ఎస్ గాలి వీస్తున్న మునుగోడు. ప్రజలు గుండెల్లో పెట్టుకొని నన్ను గెలిపించారు. నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మునుగోడు ప్రజల సేవ కొరకై పనిచేస్తానని తెలిపాడు.
మునుగోడు అభివృద్ధికి నిధులు ఇస్తలేరని నిధులన్నీ సిరిసిల్లకు, సిద్దిపేటకు తీసుకెళ్తున్నారని నేను అసెంబ్లీలో కొట్లాడితే నన్ను అసెంబ్లీ బయటకి పంపించారన్నారు. ఆ సమయంలో నేను రాజీనామా చేయడం వల్ల మునుగోడులో ఉప ఎన్నికలు రావడం ఉప ఎన్నికల్లో నన్ను ఓడించడానికి అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చి ఇక్కడ పనిచేశారని భారతదేశం మొత్తం చూసేలా ప్రభుత్వమే మునుగోడుకు దిగి వచ్చిందని నా రాజీనామా తోచే మునుగోడుకు అభివృద్ధికి నిధులు వచ్చాయని గుర్తు చేశాడు. మిగిలి ఉన్న మూడు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలో 100 పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాల భవనం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాట అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపాడు. నియోజకవర్గం లో జరుగుతున్నా రోడ్డు పనులకు నిధులు విడుదల చేయాలనీ సీఎంని అడిగానని నియిజకవర్గంలో అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు.
అదిష్టానం మంత్రి పదవీ ఇస్తానని హామీ ఇచ్చిందని.. ఇవ్వాళా వద్దా అనేది వారి ఇష్టం అంటూనే, నన్ను ఎన్నుకున్న ప్రజలకు మాత్రం అన్యాయం చేయొద్దని సీఎంని కోరానన్నారు. మెదటి విడతలో ఇళ్లు రానివారికి రెండవ విడతలో వచ్చేవిదంగా కృషి చేస్తానని చేనేత కార్మికుల రుణాలు మంజూరు కు కృషి చేస్తాఅని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు అనంత చంద్రశేఖర్, కోరిమి ఓంకారం,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్, నాయకులు కోడి గిరిబాబు, కలిమికొండ జనార్దన్, కోడి శ్రీనివాసులు, గంట సత్యం, మంచుకొండ సంజయ్, బూతరాజు దశరథ, నల్లగంటి మల్లేష్ల్, గండూరి జనార్ధన్, ఆయా గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.



