చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్
నేతన్న పథకాలపై అవగాహనా సదస్సు
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ నేతన్న భరోసా, నేతన్న భద్రత, తెలంగాణ నేతన్న పొదుపు-రుణమాఫీ పథకాలతో చేనేత కార్మికుల బతుకుల్లో మార్పు వస్తుందని చేనేత జౌళి, హస్తకళల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాలులో మంగళవారం చేనేత కార్మికులకు ‘నేతన్న భరోసా’ పథకం విధివిధానాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజ రామయ్యర్ మాట్లాడుతూ.. ఏడాది కాలంలో కనిష్టంగా నాలుగు వార్పులు, 28 చీరలు నేసి వాటిపై తెలంగాణ హ్యాండ్లూమ్ లేబుల్ అంటించి జిల్లా సహాయ సంచాలకుల కార్యాలయానికి పంపితే.. ప్రతి చేనేత కార్మికుడికీ రూ.18,000, అనుబంధ కార్మికులకు రూ.6,000 బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమవుతాయని వివరించారు. రుణమాఫీ, నేతన్న భద్రత గురించి వివరించారు. ఇలాంటి సదస్సు చేనేత కుటుంబాలకు ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు బి.శ్రీనివాస్‌రెడ్డి, సంయుక్త సంచాలకులు బి.ఇందుమతి, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ బి.పద్మ, యాదాద్రిభువనగిరి జిల్లా సహాయ సంచాలకులు ఎ.శ్రీనివాస్, నల్లగొండ జిల్లా సహాయ సంచాలకులు ఎస్.ద్వారక, చేనేత శాఖ డీఓలు, ఏడీఓలు, మాజీ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా చేనేత కార్మికులు పాల్గొన్నారు.
చేనేత కార్మికుల బతుకుల్లో మార్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES