Wednesday, March 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘పెద్ది’ చిత్రీకరణలో గాయపడ్డ చరణ్..

‘పెద్ది’ చిత్రీకరణలో గాయపడ్డ చరణ్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న చిత్రీకరణలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ గాయం కారణంగా చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. షూటింగ్‌లో భాగంగా రామ్ చరణ్ కంటి సమీపంలో చిన్న గాయం అయినట్లు తెలుస్తోంది. అయితే, ఇది చాలా చిన్న గాయమని, త్వరలోనే ఆయన కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం త్వరలోనే ఒక ప్రత్యేక గీతాన్ని కూడా చిత్రీకరించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -