- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: లండన్‌లోని మేడం టుస్సాడ్స్‌లో చరణ్ మైనపు విగ్రహన్ని శనివారం ఆవిష్కరించారు. లండన్‌లో మెగా అభిమానులు సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌లతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ విగ్రహాన్ని త్వరలోనే సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు. శాశ్వతంగా అక్కడే ప్రదర్శనకు ఉంచుతారు. గతంలో మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు బొమ్మలు లాంచ్ కాగా, ఇప్పుడు ఆ జాబితాలో చెర్రీ కూడా చేరారు.
- Advertisement -