- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఒడిశాలో చార్టర్డ్ విమానం కూలిపోయింది. రూర్కెలా నుంచి భువనేశ్వర్‌కు వెళ్తున్న విమానం టేకాఫ్ అయి 17 కిలోమీటర్ల తర్వాత కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రయాణికులందరినీ సమీపంలోని ఆస్పత్రికి స్థానికుల సహాయంతో తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విమానంలో కెప్టెన్ నవీన్ కడంగా, కెప్టెన్ తరుణ్ శ్రీవాస్తవతో సహా నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది కూలిపోయిన విమానంలో ఉన్నారు. ప్రమాద స్థలం నుంచి అందరినీ సురక్షితంగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
- Advertisement -



