ఆకలికి మతం లేదని మసీదు గోడకి పక్కన
వెలిసిన రంగులా వద్ధ దంపతులు
అల్లా కే నాం పే… గుడి మెట్ల దగ్గర
మూడు నామాల తో దేవుడికి
ఎండిన డొక్కలు చూపుతూ భవతి భిక్షాం దేహి…
చర్చి గంటల శబ్ధంలో
విని వింపించని prais a lord
రేపు ఎలాగ ఆందోళన స్వరం
అన్ని దారులూ ”ఆకలి” చౌరస్తాకే
మనిషికే కానీ ఆకలికి ఏ మతమూ లేదు
సర్వమత సామరస్యం ఒక్క
ఆకలి పేగులకే సాద్యం….
– పుష్యమీ సాగర్, 7997072896
- Advertisement -