Wednesday, October 22, 2025
E-PAPER
Homeజిల్లాలుముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేతపై హర్షం

ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేతపై హర్షం

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పడకంటి వెంకటేష్
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చసే అభ్యర్థులకు ముగ్గురు పిల్లల నిబంధనలను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రాచూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వెంకటేష్ హర్షం వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ నిబంధనను ఎత్తివేయడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిందని బుధవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమని, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్న ఎంతోమందికి అవకాశం లభిస్తుందని అన్నారు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ కే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రజర్వేషన్లు కల్పించిన సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించి త్వరగా ఎన్నికలు జరిగే విధంగా సహకరించాలని లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో బిజెపికి బీసీలు తగిన గుణపాఠం చెబుతారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దున్న దున్న సురేష్, చంద్రశేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -