Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కెమికల్ కంపెనీ అనుమతులు తక్షణమే నిలిపివేయాలి

కెమికల్ కంపెనీ అనుమతులు తక్షణమే నిలిపివేయాలి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామ సర్పంచ్ సాయగౌడ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఫ్యూజన్ హెల్త్ కేర్ కెమికల్ కంపెనీ, జెన్ కంపెనీ, వేద గ్రానెట్ కంపెనీ తక్షణమే పనులు నిలిపివేసి, ఇవ్వబడిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో గ్రానెట్ కంపెనీ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతోందని, దుమ్ము, శబ్ద కాలుష్యం పెరుగుతోందని, భూగర్భ జలాలు ప్రభావితమవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవసాయ భూములు, నివాస ప్రాంతాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖలతో సమగ్ర విచారణ చేపట్టి, కంపెనీ అనుమతులను రద్దు చేసి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల తరఫున తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -