Wednesday, April 30, 2025
Homeజోష్ఆ యువకుల జీవితంలో 'చెస్‌' గేమ్‌ ఛేంజర్‌

ఆ యువకుల జీవితంలో ‘చెస్‌’ గేమ్‌ ఛేంజర్‌

బాల్యంలో ప్రతి ఒక్కరూ ఆటవిడుపుగా ఏదో చేస్తూ ఉంటాం. కాలక్షేపానికి గంటల తరబడి ఆటలు ఆడుతూ ఉంటాం. కానీ అదే ఆట మనకు జీవితంలో భవిష్యత్‌, జీవనోపాధి అవుతుందని అనుకుంటామా. ఆ ఆట మనల్ని గొప్ప వ్యక్తులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుందని అసలు ఊహించం. కానీ కేరళకు చెందిన ఆరుగురు స్నేహితుల జీవితంలో అదే నిజమైంది.
ఖాళీ సమయంలో ఆరుగురు కూర్చొన్ని ఆడుకున్న ‘చెస్‌’ ఆట వాళ్ల జీవితంలో గేమ్‌ ఛేంజర్‌గా అయింది. అభిజిత్‌ మోహన్‌, ఆరిజిత్‌ మోహన్‌, ఆదేశ్‌ జోషి, మాను మణికందన్‌ చందర్‌ రాజు చిన్ననాటి స్నేహితులు. కొచ్చిలోని స్థానిక స్కూల్‌లో అందరు కలిసి చదువుకున్నారు. చదరంగంపై మక్కువతో గంటలు తరబడి ఆడవిడుపుగా చెస్‌ గేమ్‌ ఆడేవారు. సోషల్‌ మీడియాకు బానిసలౌవుతున్న నేటి తరం పిల్లలను మెదుడుకు మేత పెట్టే ఆటల వైపు మళ్లీస్తే ఎలాంటుందని, అదే ఆటను ఆన్‌లైన్‌ వేదికగా శిక్షణ కల్పిస్తే బాగుంటుందని ఆ మిత్ర బృoదానికి చిరు ఆలోచన తట్టించాడు.. అతుల్‌ అనే దగ్గర బంధువు. అతుల్‌ ప్రేరణతో తన పరిసరాల్లో ఆరుగురు పిల్లలతో 2005లో ఓ చిన్న టోర్నమెంట్‌ను నిర్వహించి.. చెస్‌ ఆటలో నైపుణ్యాలను పెంచడానికి శిక్షణ సంస్థను ఆరుగురు స్నేహితులు ప్రారంభించారు. పిల్లల తల్లిదండ్రుల ఆదరణతో అనాతికాలంలోనే Eight Times Eight (8X8) పేరు మారుమోగింది. పిల్లలకు చదరంగంతోపాటు జీవిత నైపుణ్యాలను బోధించారు.
8శ8 అనేది ఒక ఆన్‌లైన్‌ గ్లోబల్‌ చెస్‌ అకాడమీ. చెస్‌తో పాటు 5 నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు నైపుణ్యాలను బోధిస్తుంది. పిల్లలలో క్లిష్టమైన ఆలోచన, నిర్ణయం తీసుకోవడంలో సమయస్ఫూర్తిని పెంపొందించే మెళుకువలు నేర్పిస్తున్నారు. సంస్థ ప్రారంభించినప్పుడు వాళ్లు పలు సవాళ్లను ఎదురుకున్నారు. ఆ తర్వాత గ్రాండ్‌మాస్టర్‌ ఎల్‌. నారాయణన్‌ సహాయంతో అంతర్జాతీయ స్థాయి పాఠ్యాంశాన్ని అభివద్ధి చేశారు. దీంతో ఆయన సూచనలతో పలు వినూత్న పద్ధతిలో చెస్‌ బోధనల పద్ధతులు ప్రారంభించారు.
వయస్సు వారీగా పిల్లలను విభజించి.. ఉన్నతమైన శిక్షకులను నియమించారు. దీంతో ఆరుగురుతో ప్రారంభమైన 8శ8 చెస్‌ అకడామీ.. ఇప్పుడు వేల సంఖ్యలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. మూడు సంవత్సరాలలో 5,000 మందికి పైగా విద్యార్థులకు 8శ8 సంస్థలో శిక్షణ ఇచ్చారు. 1,000 మంది విద్యార్థులలో అత్యున్నత ప్రతిభ కనబర్చి, వివిధ స్థాయిల్లో సత్తా చాటారు. అనతికాలంలోనే సంస్థ పేరు మారుమోగింది. దీంతో వార్షిక ఆదాయం 18 లక్షల నుండి 1.13 కోట్లకు పెరిగింది. దీంతో భవిష్యత్‌లో 8×8 AIశక్తితో నడిచే లైవ్‌, ఇంటరాక్టివ్‌ చెస్‌ శిక్షకుడిని అభివద్ధి చేయాలని, వయోజన చెస్‌ విద్యలో విస్తరించాలని యోచిస్తోంది. అంతర్జాతీయంగా చెస్‌ ఆటను నిర్వహిస్తున్న పలు అకడామీలతో ఇంటర్‌ షిప్‌ తీసుకున్నారు. ఆధునాతన పద్ధతుల్లో విద్యార్థులకు ఆటలో మెళుకువలు నేర్పుతూ పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్‌ ఆ సంస్థ విద్యార్థులు సత్తాచాటారు.
ఆద్వైత్‌ శంకర్‌ అనే విద్యార్థి ప్లోరిడా వేదికగా జరిగిన చెస్‌ టోర్నీలో నేషనల్‌ మాష్టర్‌ యూఎస్‌ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆర్‌ ఆర్యన్‌ మరో విద్యార్థి.. తమిళనాడులో జరిగిన అండర్‌-7 చెస్‌ చాంపియన్‌ సాధించాడు. అదే విధంగా కేరళకు చెందిన తిర్నాథ్‌ జోతిస్‌ రాష్ట్ర స్థాయిలో చెస్‌ టోర్నీలో ప్రతిభ కనబర్చాడు. ఫిడ్‌కు అనుబంధంగా పలు టోర్నీలో రాణించాడు. ప్రపంచంలో మేటి చెస్‌ క్రీడాకారులతో.. అన్ని భాషల్లో క్లాసులు నిర్వహిస్తు మెరికలాంటి చెస్‌ ఆటగాళ్లను 8శ8 చెస్‌ అకడామీ తయారు చేస్తుంది. భవిష్యత్‌లో ప్రపంచ స్థాయిలో ‘8శ8 చెస్‌ అకడామీ’ని తీర్చిదిద్దుతామని స్థాపకులు స్పష్టం చేశారు.


”తన బిడ్డ సోషల్‌ మీడియాకు బానిసై, దేనిపైనా దష్టి పెట్టలేకపోతున్నాడని ఓ బంధువు ఆవేదనే.. ఈ సంస్థకు పునాది”
– 8×8 జజుఉ సహ వ్యవస్థాపకుడు అతుల్‌ కష్ణ

తమ పిల్లలు చెస్‌ నేర్చుకోవడమే కాకుండా వారి ఓర్పు, ఏకాగ్రతను కూడా మెరుగుపరుచుకుంటున్నారని తల్లిదండ్రులు మాకు చెప్పారు.
– 8×8 డైరెక్టర్‌ అభిజిత్‌ మోహన్‌
పిల్లలు చక్కటి వ్యక్తిత్వాలను అభివద్ధి చేసుకోవడంలో సహాయపడటానికి మేము జ్ఞాపకశక్తి అభివద్ధి, నమూనా గుర్తింపును బోధిస్తాము. చెస్‌ మీడియేషన్‌ అనేది మేము నిర్వహిస్తున్న మరొక ప్రత్యేక కార్యక్రమం, ఇక్కడ మేము చాలా చిన్న వయస్సు నుండే పిల్లలలో విజువలైజేషన్‌ను మెరుగుపరచడానికి చెస్‌, మీడియేషన్‌ పద్ధతులను మిళితం చేస్తాము.
– ఆదేశ్‌ జోషి
మేము నైపుణ్యం కలిగిన చెస్‌ ఆటగాళ్లం కాము, అధికారిక సిలబస్‌ను రూపొందించడం గురించి మాకు పెద్దగా తెలియదు. నా చిన్ననాటి స్నేహితుడు, భారతదేశంలో మాజీ నంబర్‌ 4 చెస్‌ ఆటగాడు గ్రాండ్‌మాస్టర్‌ ఎస్‌.ఎల్‌. నారాయణన్‌ సహాయంతో, మేము అంతర్జాతీయ ప్రమాణాల సిలబస్‌ను అభివద్ధి చేసాము, అది ఇప్పుడు మా బోధనా నమూనాకు వెన్నెముకగా పనిచేస్తుంది.
– ఆరిజిత్‌ మోహన్‌
– దామచర్ల ఉపేందర్‌,
7093937730 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img