Monday, November 24, 2025
E-PAPER
Homeజిల్లాలుచేవెళ్ల రోడ్డు ప్ర‌మాదం..లారీపై అనేక చ‌లాన్లు

చేవెళ్ల రోడ్డు ప్ర‌మాదం..లారీపై అనేక చ‌లాన్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదానికి కారణమైన బస్సు, టిప్పర్ లారీపై గతంలో పలు ట్రాఫిక్ చలాన్లు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. స‌దురు ఆర్టీసీ బస్సుపై రూ. 2,305 చలాన్లు, టిప్పర్ లారీపై రూ. 3,270 చొప్పున చలాన్లు ఉన్నట్లు గుర్తించారు.

ఇవి ప్రధానంగా రాంగ్ రూట్, సిగ్నల్ జంప్ వంటి ఉల్లంఘనలకు సంబంధించి ఉన్నాయి. ఈ ప్రమాదానికి డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు చెబుతున్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును కంకర లారీ ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటన సంబంధించి సహాయం కోసం 9912919545, 94408544332 రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లను ఉంచింది.

Chevella Bus Accident

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -