Monday, October 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలురూ.100కే కేజీ చికెన్.. ఎగబడిన జనం

రూ.100కే కేజీ చికెన్.. ఎగబడిన జనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నూలులో ఆదివారం వింత ఘటన చోటు చేసుకుంది. కోడుమూరులోని బళ్లారి రోడ్డులో ఇటీవల ఓ వ్యాపారి కొత్తగా చికెన్ వ్యాపారం ప్రారంభించాడు. మార్కెట్ రేటు కంటే తక్కువగా రూ.110కే కేజీ చికెన్ అమ్ముతున్నాడు. అది చూసిన మరో వ్యాపారి రూ.10 తగ్గించి రూ.100కే కేజీ చికెన్ అంటూ బోర్డు పెట్టాడు. దాంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం కోడుమూరుకు వచ్చి చికెన్ కొనుగోలు చేశారు. కాగా, ప్రస్తుతం మార్కెట్‌లో కిలో చికెన్ రూ.200 పలుకుతుండగా.. స్కిన్ లెస్ రూ.230 వరకు ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -