- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. నిన్నటి వరకు కిలో రూ.330గా ఉన్న చికెన్ ధర నేడు రూ.400కు చేరింది. విజయవాడలో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.380-రూ.400 మధ్య అమ్ముడవుతుండగా, హైదరాబాద్‌లో రూ.340-350 వరకు విక్రయిస్తున్నారు. పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.
- Advertisement -



