- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : చికెన్ ధర ఎక్కువ చెప్పినందుకు షాప్ యజమానిపై యువకులు దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు చికెన్ రేట్ ఎక్కువగా ఉందని వాదనకు దిగారు. తర్వాత ఆగ్రహంతో కత్తితో షాప్ యజమానిపై దాడి చేశారు. స్థానికులు అడ్డుకోవడంతో యువకులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -