- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియా కూటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు.2029 నాటికైనా కూటమి పుంజుకుంటుందేమో చూడాలన్నారు. రాజకీయ అనుభవంతో చెబుతున్నాను.. బీజేపీ మాత్రం అంత్యంత బలంగా ఉందన్న మాట వాస్తవమన్నారు. సల్మాన్ ఖుర్షీద్ – మృతుంజయ్ సింగ్ యాదవ్ రాసిన ‘‘కాంటెస్టింగ్ డెమోక్రటిక్ డెఫిసిట్’’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చిదంబరం పాల్గొని మాట్లాడారు. ఇండియా కూటమి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందో లేదో తనకు కచ్చితంగా తెలియదని చెప్పారు. కానీ బీజేపీ మాత్రం ప్రతి విభాగంలోనూ బలంగా ఉందని చెప్పారు. ఒకవేళ ఇండియా కూటమి చెక్కుచెదరకుండా ఉంటే తాను చాలా సంతోషిస్తానన్నారు.
- Advertisement -