Tuesday, February 17, 2026
E-PAPER
Homeజాతీయంఅసోంలో కేంద్ర‌ ఎన్నిక‌ల క‌మిష‌న్‌ ప‌ర్య‌ట‌న‌

అసోంలో కేంద్ర‌ ఎన్నిక‌ల క‌మిష‌న్‌ ప‌ర్య‌ట‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: త్వ‌ర‌లో అసోంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్ప‌టికే స‌ర్ ప్ర‌క్రియ చ‌ర‌వేగంగా సాగుతోంది. తాజాగా కేంద్ర‌ ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆ రాష్ట్ర రాజ‌ధాని గౌహ‌తికు చేరుకుంది. ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ త‌న బృందంతో మూడు రోజుల‌పాటు అసోంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంతో భేటి కానున్నారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణకు సంబంధించి ప‌లు అంశాల‌పై వారితో కేంద్ర ఈసీ బృందం చ‌ర్చించ‌నుంది. అదే విధంగా ఫిబ్ర‌వ‌రి 17న ఆ రాష్ట్రంలోని వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో కీల‌క స‌మావేశం నిర్వ‌హించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -