నవతెలంగాణ-హైదరాబాద్:త్రివిద దళాల అధిపతులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మే7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి సవివరంగా వివరించారు. రక్షణ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ సిబ్బంది అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళాల అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్, నావికా దళాల అధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి తో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఆపరేషన్ సిందూర్ గురించి రాష్ట్రపతికి వివరించారు. అలాగే కాల్పుల విరమణ, సరిహద్దు భద్రతల గురించి కూడా రాష్ట్రపతికి తెలిపారు. అనంతరం ఉగ్రవాదంపై భారతదేశం యొక్క ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా మార్చిన సాయుధ దళాల పరాక్రమం, అంకితభావాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. రెండురోజుల క్రితం ప్రధాని మోడీతో పలు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆపరేషన్ సింధూర్‌పై ఆపడేట్ ఇస్తూ సైన్యాధిపతులు పాక్ వ్యూహాలను చిత్తుచేశారు. అంతేకాకుండా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ తర్వాత త్రివిద దళాల అధిపతులు మీడియా సమావేశం నిర్వహించి..ఆపరేషన్ సిందూర్ తీరుతెన్నలు వివరించారు. అదే విధంగా 70దేశాలకు పైగా ఆపరేషన్ సిందూర్ గూరించి బ్రీఫింగ్ ఇచ్చారు.
రాష్ట్రపతిని కలిసిన త్రివిద దళాల అధిపతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES