- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: యూపీలోని బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత వారం రోజుల్లో ఆరు దాడులు జరగగా, ఒక చిన్నారి మృతి చెందింది. మరో మహిళ, యువకుడితో సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ శాఖ అధికారులు తోడేళ్లను పట్టుకునేందుకు పంజరాలు ఏర్పాటు చేసి, డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. గత ఏడాది కూడా ఇలాంటి దాడులు జరిగి భయంతో జీవించినట్లు స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
- Advertisement -