Wednesday, March 18, 2026
E-PAPER
Homeకరీంనగర్జగన్నాథ్ పూర్ లో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

జగన్నాథ్ పూర్ లో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని జగన్నాథ్ పూర్ గ్రామంలో బుధవారం గ్రామ బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.తెలంగాణ రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం. చందన ఆధ్వర్యంలో,జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధ్యక్షతన 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి గ్రామ సభలో తీర్మానం చేశారు.ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ గ్రామాల్లో బాలల హక్కుల పరిరక్షణ,బాలికల సమస్యల గుర్తింపు,పరిష్కారం కోసం కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.గర్భిణులు తప్పనిసరిగా నమోదు చేసుకోవడం, పుట్టిన పిల్లలకు టీకాలు వేయించడం, ప్రతి బాలుడు పాఠశాలలో చేరేలా చూడడం,డ్రాప్‌అవుట్ లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.గ్రామంలో ప్రమాదకర పరిస్థితులను తొలగిస్తూ పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించాలని తెలిపారు.బాలలపై ఎలాంటి అన్యాయం జరిగినా వెంటనే అధికారులకు లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల కోసం రూపొందించిన ఆడియో క్లిప్‌ను ఆవిష్కరించి, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజ్‌కుమార్,రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సి.హెచ్ సుధీర్ రావు,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు శివకుమార్,సిడిపిఓ మమత,జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీష్, సర్పంచ్ పరాచ శంకర్,ఉప సర్పంచ్ కుర్ర మల్లయ్య,కార్యదర్శి మౌనిక,యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -