పాఠశాలలో ఘన్నగా బాలల దినోత్సవం..
నవతెలంగాణ – పెద్ద కొడప్ గల్
మండల కేంద్రంతో పాటు మండలంలోని ప్రభుత్వ, పాఠశాలలో శుక్రవారం జవహర్ లాల్ నెహ్రూ జయంతిని ఘన్నగా నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రు చిత్ర పటానికి పులా మాల వేసి నివాళులర్పించారు. వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రోద్యమంలో మాజీ భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ పాత్ర, దేశానికి అందించిన సేవలను విద్యార్థులకు వివరించారు. దేశంలోని జాతీయ నాయకుల జీవిత చరిత్రను విద్యార్థులు స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగాలని కొనియాడారు. విద్యార్థులే ఉపాధ్యాయులు అయి విద్యను బోధించారు. పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
బేగంపూర్ పాఠశాలలో బాలల దినోత్సవం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



