నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్‌లోని పౌర నివాసాలపై అమెరికా-ఇజ్రాయిల్ దాడులను చైనా ఖండించింది. ఈమేరకు ఇండియాలోని చైనా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పేర్కొంది. ఈ తరహా దాడులు అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తున్నాయని విమర్శించింది. తక్షణమే యూఎస్-ఇజ్రాయిల్ పౌర నివాసాలపై దాడులను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేసింది. రాజకీయ, పరస్పర దౌత్య చర్యల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. యుద్ధం నేపథ్యంలో భారీ స్థాయిలో మావన హననం సాగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తం ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఇరాన్ ప్రతిదాడులతో గల్ఫ్ దేశాల్లో యూఎస్ సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది.
పౌర నివాసాలపై యూఎస్-ఇజ్రాయిల్ దాడులు..ఖండించిన చైనా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



