Thursday, October 9, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రధాని మోడీకి చైనా ఆహ్వానం

ప్రధాని మోడీకి చైనా ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – హైదారబాద్: భారత్, చైనా మధ్య సంబంధాల విషయంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా చైనాలో పర్యటించనున్నారు. ఈ నెలాఖరులో టియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్నట్లు చైనా శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.

ఈ ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాంజిన్‌లో ఎస్సీఓ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి భారత ప్రధాని మోడీ వస్తున్న విషయాన్ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ధృవీకరించారు. “ఎస్సీఓ టియాంజిన్ సదస్సు కోసం ప్రధాని మోడీ చైనాకు రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అన్ని సభ్య దేశాల సమష్టి కృషితో ఈ సదస్సు విజయవంతమవుతుందని, ఎస్సీఓ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని విశ్వసిస్తున్నాం” అని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -