Monday, March 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమొజ్తాబా ఖమేనీ ఎన్నిక‌ను గుర్తిస్తున్నాం: చైనా

మొజ్తాబా ఖమేనీ ఎన్నిక‌ను గుర్తిస్తున్నాం: చైనా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఎన్నికైనట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించిన విష‌యం తెలిసిందే. 88 మందితో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ బాడీ ఆయన్ను ఎన్నుకుంది. తాజాగా నూత‌న ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఎన్నిక‌పై చైనా స్పందించింది. ఆ దేశ సుప్రీం లీడ‌ర్ మొజ్తాబా ఖమేనీ ఎన్నిక‌ను గుర్తించిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ‘ఇది ఇరాన్ రాజ్యాంగం ఆధారంగా తీసుకున్న నిర్ణయం, బీజింగ్ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని, ఇరాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని విశ్వసిస్తుందని’ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -