Tuesday, June 10, 2025
E-PAPER
Homeబీజినెస్మే నెలలో 4.8శాతం పెరిగిన చైనా ఎగుమతులు

మే నెలలో 4.8శాతం పెరిగిన చైనా ఎగుమతులు

- Advertisement -

అమెరికా నుంచి తగ్గిన దిగుమతులు
బీజింగ్‌ :
చైనా ఎగుమతులు మే నెలలో గతేడాది కంటే 4.8శాతం పెరిగాయి. అదే సమయంలో అమెరికాకు ఎగుమతులు సుమారు 10శాతం తగ్గాయి. ఇది అంచనా కంటే కొంచెం తక్కువని సోమవారం విడుదలైన కస్టమ్స్‌ గణాంకాల నివేదిక పేర్కొంది. దిగుమతులు సంవత్సరానికి 3.4శాతం తగ్గాయని, దీంతో 103.2 బిలియన్‌ డాలర్ల వాణిజ్య మిగులు ఏర్పడిందని తెలిపింది. గత నెలలో చైనా అమెరికాకు 2.8 బిలియన్‌ డాలర్లు ఎగుమతి చేయగా, అమెరికా నుంచి దిగుమతులు 7.4శాతం తగ్గి 10.8బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయని నివేదిక పేర్కొంది. ఏప్రిల్‌లో చైనా ప్రపంచ ఎగుమతులు 8.1శాతం పెరిగిన తర్వాత మేనెలలో వాణిజ్యం మందగించింది. చైనా-అమెరికాల మధ్య తదుపరి రౌండ్‌ చర్చలు సోమవారం లండన్‌లో జరగాల్సి ఉన్నాయి. గతవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫోన్‌లో సంభాషించారు. మే ప్రారంభంలో ఇరు దేశాలు టారిఫ్‌లను 90 రోజుల పాటు నిలిపివేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -