Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంభార‌త్‌లో చైనా విదేశాంగ మంత్రి మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌

భార‌త్‌లో చైనా విదేశాంగ మంత్రి మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్: చైనా విదేశాంగ శాఖా మంత్రి వాంగ్‌యి ఆగస్టు 18 నుండి 20 వరకు భారత్‌లో పర్యటిస్తారని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి శనివారం వెల్లడించారు. చైనా, భారత్‌ సరిహద్దు సమస్యపై ప్రతినిధులతో వాంగ్‌యి 24వ రౌండ్‌ చర్చలు జరపనున్నారు.

కాగా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఆహ్వానం మేరకు చైనా విదేశాంగ శాఖా మంత్రి వాంగ్‌ యి భారత్‌ను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భారత్‌–చైనా సరిహద్దు ప్రశ్నలపై 24వ రౌండ్‌ ప్రత్యేక ప్రతినిధుల (ఎస్‌ఆర్‌) చర్చలను వాంగ్‌ యి దోవల్‌తో నిర్వహిస్తారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటన తెలిపింది. ఈ పర్యటనలో వాంగ్‌యి భారత విదేశాంగ శాఖా మంత్రి ఎస్‌. జై శంకర్‌తో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చించనున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది.

2020లో సరిహద్దులో భారత, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఇరు దేశాధినేతలు చర్చించుకోవడం ఇది రెండోసారి. ఇదిలా ఉండగా.. మరోవైపు ఈ నెల చివరలో భారత ప్రధాని నరేంద్రమోడీ చైనాలో పర్యటించనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad