- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించారు. దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందనున్న చిరంజీవి 158వ చిత్రం జనవరి 25న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ ఎన్‌కే నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి మరోసారి మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
- Advertisement -



