నవతెలంగాణ-ఆలేరు రూరల్: నిరుపేద కుటుంబం నుండి వచ్చిన యువతకు ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో మార్గదర్శకుడిగా నిలుస్తూ, సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ ఫౌండర్, జనరల్ సెక్రటరీ ఆలేరు మండలం మంతపురి గ్రామానికి చెందిన బండారి ప్రసాద్ ముదిరాజ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన చొలన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు వాట్సాప్ మాధ్యమం ద్వారా స్టేట్, సెంట్రల్ పోలీసు నియామకాల సమాచారం అందించడం, జాబ్ ఓరియెంటెడ్ పీడీఎఫ్ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేయడం, కవాతు శిక్షణ, పుస్తకాలు, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు సుమారు 175 మందికి కేంద్ర బలగాలలో ఉద్యోగాలు సాధించేందుకు మార్గం చూపించారు. ఈ సేవలను గుర్తించి అందజేసిన ఈ అవార్డును రోడ్డు & భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారి చేతుల మీదుగా ప్రసాద్ ముదిరాజ్ స్వీకరించారు.ఈ కార్యక్రమంలో సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అరిగే లోకేష్ ముదిరాజ్, ట్రెజరర్ దేమి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రుల చేతుల మీదుగా చొలన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



