- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్య 100వ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వారిని కలిసి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని హరీష్ రావు ఆకాంక్షించారు.ఈ దేశానికి, విద్యారంగానికి వారు అందించిన సేవలు వెలగట్ట లేనివని ప్రశంసించారు. తెలంగాణ సమాజంలో పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవించే వ్యక్తి రామయ్య అని కొనియాడారు.రామయ్య సిద్దిపేట్ డిగ్రీ కాలేజీలలో లెక్చరర్‌గా పనిచేసినప్పటి నుండి తనకు వారితో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.
- Advertisement -



