Saturday, May 17, 2025
Homeజాతీయంఆఫీస్ బాయ్ ను చెప్పుతో కొట్టిన సీఐ

ఆఫీస్ బాయ్ ను చెప్పుతో కొట్టిన సీఐ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి నీవు డబ్బులు వసూలు చేసుకొని నాపై చెబుతావా.. నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తావా అంటూ కళ్యాణదుర్గం ఎక్సైజ్‌ సీఐ హసీనాభాను ఆఫీస్‌ బాయ్‌ని చెప్పుతో కొట్టారు. ఈ వీడియో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్‌ కార్యాలయం పరిధిలో మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి సదరు సీఐ ప్రతి నెలా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంపై ఆఫీస్‌ బాయ్‌ నాని ఎక్సైజ్‌ ఉద్యోగుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు ఈమధ్యే ఆమెతో మాట్లాడేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆఫీస్‌ బాయ్‌ని సీఐ పిలిపించారు. ఆయన మాట్లాడుతుండగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారి ఎదుట చెప్పుతో కొట్టారు. ఈ ఘటన అనంతపురం ఎక్సైజ్ స్టేషన్ లో రెండు రోజుల క్రితం జరిగినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -