నవతెలంగాణ – బిచ్కుంద 
జాతీయ ఐక్యత దినోత్సవ సందర్భంగా ఐక్యత కోసం పరుగు కార్యక్రమాన్ని బిచ్కుంద పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి కందర్ పల్లి చౌరస్తా వరకు సీఐ రవికుమార్, ఎస్సై మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా  సిఐ రవికుమార్ మాట్లాడుతూ.. భారతదేశ ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.  జాతీయ ఐక్యత దినోత్సవం ముఖ్య ఉద్దేశం భారతదేశపు పౌరులందరూ శాంతి ఐక్యత సోదర భావాన్ని కాపాడుటకు జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహించడం జరుగుతున్నదని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ప్రాముఖ్యతని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కొలవార్ కుమార్ సెట్, దర్పల్ గంగాధర్, గంగారం సార్, విజయభాస్కర్ రెడ్డి, అశోక్ పోలీస్ సిబ్బంది, విద్యార్థులు , యువకులు పాల్గొన్నారు.
బిచ్కుందలో 2కే రన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    