Thursday, October 23, 2025
E-PAPER
Homeఖమ్మంఖాళీగా ఉన్న పోస్ట్ ల భర్తీ కోసం సర్క్యులర్ ను విడుదల చేయాలి: టీబీజీకేఎస్     ...

ఖాళీగా ఉన్న పోస్ట్ ల భర్తీ కోసం సర్క్యులర్ ను విడుదల చేయాలి: టీబీజీకేఎస్                    

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు
ఏరియా నందు యాక్టింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే కేటగిరి పోస్ట్ ల పదోన్నతుల కోసం యాజమాన్యం వెంటనే సర్క్యులర్ ను  విడుదల చేయాలని ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు యాజమాన్యాన్ని గురువారం కోరారు. పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ ప్రతి ఏటా ఏరియా నందు ఏర్పడిన కేటగిరి ఖాళీలను గుర్తించి అర్హులైన వారితో  వాటిని పారదర్శకంగా భర్తీ చేసే యాజమాన్యం ఈ ఏడాది టైం రేటెడ్ సర్క్యులర్  ఆలస్యం కావడం వల్ల వివిధ కేటగిరి పనులకు వెళ్లి యాక్టింగ్ లు పొందిన కార్మికులు కేటగిరి ల పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు.

ఏరియా నందు సుమారు 140 వరకు కేటగిరి పోస్ట్ లు ఖాళీలు  ఏర్పడ్డాయని అర్హులైన వారితో వాటిని భర్తీ చేయడం మూలంగా ఏరియా ప్రగతి, కార్మిక ఉజ్వల భవిష్యత్తు కు బంగారు బాటలు పడతాయని యాజమాన్యం స్పందించి త్వరితగతిన కేటగిరి ల పోస్ట్ ల భర్తీ కోసం టైం రేటెడ్ సర్క్యులర్ విడుదల చేయాలని తెలియచేశారు. ఏరియా నందు సి యస్ ఎల్ ఛార్జర్ సేఫ్టీ ల్యాంపు పోస్ట్ ల ఖాళీలను గత ఏడాది యాజమాన్యం గుర్తించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించినప్పటికీ నేటి వరకు వారికి ఎలాంటి అర్హత పరీక్ష నిర్వహించకపోవడం వల్ల ఆ కేటగిరి అర్హత ఉన్న కార్మికులు ఆ కేటగిరి పోస్ట్ ల కోసం ఎదురు చూస్తున్నారని ఈ ఏడాది విడుదల చేసే కేటగిరి ఖాళీలలో వాటిని కూడా చేర్చి అర్హత పరీక్ష నిర్వహించి ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, మునిగేల నాగేశ్వర రావు, రామ చారి మస్తాన్, జంగం రాజ్ కుమార్, మురళీ కృష్ణ, సుద్దాల సంపత్ కుమార్,ముకేశ్ కుమార్, సుధాకర్, సేవా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -