– ఎం సి పి ఐ పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బర్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నీటి సరఫరా ఎద్దడి కొనసాగుతుందని ఎం సి పి ఐ పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి పెద్ద చెరువు నీళ్లు సరిపడా ఉన్నప్పటికీ నీటి సరఫరా లో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. దీంతో ఆర్డిఓ కార్యాలయం వద్ద ఉన్న రెండు ట్యాంకులు, గడి రోడ్డులో ఒక్క ట్యాంకులో నీటిని నింపడానికి సమస్యగా మారిందనీ ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు ప్రజల గురించి పట్టించుకునే నాధుడే లేడు అన్నట్టుగా అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా పట్టణంలో ట్యాంకర్లు పెంచి ప్రతి వార్డులో దినం తప్పించి దినం ట్యాంక్ అల్లా ద్వారా నీటిని పోయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ వేసవిని తట్టుకొని బతకాలంటే నీరు లేకపోతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అన్నారు.