- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి నెలకొందని భావిస్తున్న తరుణంలో హమాస్, అల్-ఖైదా అనుబంధ సంస్థ డోగ్మూష్ తెగ మధ్య జరిగిన ఘర్షణల్లో సుమారు 64 మంది మరణించారు. వీరిలో 52 మంది డోగ్మూష్ తెగకు చెందినవారు కాగా, 12 మంది హమాస్ ఉగ్రవాదులు. హమాస్ సీనియర్ అధికారి బసెమ్ నయీమ్ కుమారుడు కూడా మృతుల్లో ఉన్నట్లు హమాస్ టీవీ వెల్లడించింది. ఈ సంఘటన అక్టోబర్ 14న గాజాలో చోటుచేసుకుంది.
- Advertisement -