- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎన్నికలకు 6 రోజుల ముందు బంగ్లాలో ఘర్షణలు చెలరేగాయి. దేశ సలహాదారు యూనస్ నివాసం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నేషనల్ పే స్కేల్ అమలు చేయాలని దేశంలోని ఉద్యోగులు ఢాకాలోని షహీద్ మినార్ నుంచి యూనస్ నివాసానికి ర్యాలీగా వచ్చారు. లోనికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, వాటర్ క్యానన్స్, టియర్ గ్యాస్, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించారు. ఢాకా అంతటా భారీగా బలగాలను మోహరించారు.
- Advertisement -



