నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు వరుసగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలో మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి 24 గంటలు గడువక ముందే.. సూర్యాపేట జిల్లా నడిగూడెంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయలో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకున్నది.
మునగాల మండలం కలకోవకు చెందిన తనూజ నడిగూడెం కేజీబీవీలో 10వ తరగతి చదువుతున్నది. తనుంటున్న గదిలో చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. గమనించిన తోటి విద్యార్థులు పాఠశాల సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, సోమవారం సాయంత్రం హాస్టల్‌లో తనూజను ఆమె తండ్రి చూసివెళ్లారు. ఇంతలోనే ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టడం విశేషం.