నవతెలంగాణ-హైదరాబాద్ : కలిగిన తన కమ్యూనిటీ పేజ్ లో లైవ్ చేయటం ద్వారా, వారితో పాటు ఈ వేడుకను తన అధికార వెబ్ సైట్లో చేసుకున్నది. కనుగొని, కనెక్ట్ కావటాన్ని కేవలం ఒక క్లిక్ దూరంలోకి తేవటం ద్వారా రైడర్లను స్థానిక రైడింగ్ సమాజానికి (జావా-యెజ్ డీ- BSA రైడర్స్ క్లబ్) మరింత చేరువ చేసేందుకు ఈ కొత్త పేజ్ ను రూపొందించటం జరిగింది.
రిపబ్లిక్ డే రైడ్స్, భిన్నత్వంలో ఏకత్వం కోసం నొమాడ్స్, ప్రాంతాలు మరియు సంస్కృతులకు అతీతంగా, జమ్ము నుండి తమిళనాడు వరకు, గుజరాత్ నుండి మణిపూర్ వరకు, వ్యాపించి ఉన్నారు. జావా, యెజ్ డీ మరియు BSAల నుండి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ పట్ల ఉన్న ఏకైక అభిమానం కారణంగా ఏకమయ్యే భారతదేశపు విశాలమైన భౌగోళిక వ్యాప్తికి ఇది అద్ధం పడుతుంది. ఈ మోటార్ సైకిళ్ళ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, 2,000 మందికి పైగా రైడర్లను ఒక చోటకు చేర్చాయి. వీరు 20 స్వతంత్ర రైడింగ్ కమ్యూనిటీలకు, 150 డీలర్ షిప్ ల నేతృత్వంలోని రైడింగ్ గ్రూపులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరంతా వివిధ వయోవర్గాలకు, వృత్తివ్యాపారాలకు, రైడింగ్ స్టైళ్ళకు చెందినవారు.
నిష్ణాతులైన రైడర్లు, మొదటిసారి టూర్ చేస్తున్నవారి సరసన, జావా, యెజ్ డీ మరియు BSA బ్రాండ్లకు చెందిన ఆధునిక పెర్ఫార్మెన్స్ క్లాసిక్స్ లెగసీ మెషీన్ల మీద రైడ్ చేశారు. స్వతంత్ర కమ్యూనిటీలు, డీలర్ షిప్ ల నేతృత్వంలోని రైడింగ్ గ్రూపులు ఇప్పుడు, క్లాసిక్ లెజెండ్స్ వారి రైడింగ్ సమూహమైన ‘నొమాడ్స్’ ద్వారా, బ్రాండ్ యొక్క ఉమ్మడి వెబ్ సైట్ పై అన్ని బ్రాండ్ల రైడింగ్ గ్రూపులను మరింతగా ఏకమై సంఘటితమవుతాయి.
జావా, యెజ్ డీ, మరియు BSAల వ్యాప్తంగా రైడింగ్ కమ్యూనిటీల్లో నొమాడ్స్ ను, వారి ఉమ్మడి గుర్తింపుగా ఉండేందుకు డిజైన్ చేయటం జరిగింది. అది బ్రాండ్లకు, ప్రాంతాలకు, రైడ్ ఛాయిస్ లకు అతీతమైనది. క్యాంపెయిన్లచే కాక, రైడర్లచే తయారుచేయబడిన నొమాడ్స్, సార్వజనీనత, స్వాతంత్రం, తన తరహా వ్యక్తులకు చెందిన వారితో కలిసి రైడ్ చేయటంలో ఆనందాన్ని ఇనుమడింపజేస్తుంది. నొమాడ్స్ వెబ్ సైట్ ను జాతీయ స్థాయిలో ప్రారంభించటానికి రిపబ్లిక్ దినోత్సవం ఒక తగిన వేడుకగా నిలిచింది. ఈ పేజ్ వలన రైడర్ తనకు సమీపంలో ఉన్న రైడింగ్ క్లబ్ ను కనుగొనటం తేలికవుతుంది. దానితో వారు తమ తరహా రైడర్లతో కలిసి మరింత తరచుగా బయటకు రైడ్ కు వెళ్ళగలుగుతారు.
అనుపమ్ థరేజా, కో-ఫౌండర్, క్లాసిక్ లెజెండ్స్, ఇలా అన్నారు, “మోటర్ సైకిల్ నడపటం వెనుక మీ స్వంత బ్రాండ్ స్వాతంత్రాన్ని కోరుకునే బలమైన సంకల్పం ఉంటుంది. మా పెర్ఫార్మెన్స్ క్లాసిక్స్ ను ఆ ఆర్తిని తీర్చుకునేందుకు డిజైన్ చేయటం జరిగింది. అయితే తరతరాలుగా మోటర్ సైక్లింగును నిర్వచించే ఒక ప్రగాఢమైన కోరిక – చెందాలన్న తపన – ఉన్నది, ప్రత్యేకించి డిజిటల్ ఓవర్ లోడ్ తో ఒంటరిగా గడుపుతున్న ఈ రోజుల్లో. కొద్ది రోజులు, మీరు ఒంటరిగా రైడ్ చేయటం కావచ్చు, అయితే రిపబ్లిక్ డే అనేది కలిసి రైడ్ చేయటానికి సంబంధించినది. ఈ రోజున, జావా, యెజ్ డీ మరియు BSA వార్షిక రైడ్లు, వివిధ రైడర్లను సమీకరించి, ఒక సమైక్యమైన జట్టుగా రైడ్ చేసేందుకు దోహదం చేస్తాయి. ఈ ఏడాది, వారి కథలను షేర్ చేయటానికి మించి మేము సెలబ్రేట్ చేస్తున్నాము. మేము మా కమ్యూనిటీ పేజ్ నొమాడ్స్ ను లైవ్ చేస్తున్నాము. దీనితో మా రైడర్లు అందరూ, పాతవారు కావచ్చు లేదా కొత్తవారు కావచ్చు, తమ సమీపంలో ఒక రైడింగ్ కమ్యూనిటీని కనుగొనవచ్చు. మా రైడింగ్ సమూహం కోసం పేరు, హద్దులను పరీక్షించాలి కాని మోటర్ సైక్లింగ్ పట్ల ప్రేమ అనే ఒక ఆశయం కోసం ఒకరికొకరు బాసటగా ఉండాలన్న తపనను గుర్తిస్తుంది.”
నొమాడ్స్ పేజ్ ప్రారంభించటానికి అదనంగా, తోటి నొమాండ్లతో పాటు రైడింగ్ యొక్క స్ఫూర్తికి సలాము చేస్తూ రోజంతా జావా, యెజ్ డీ మరియు BSA మోటార్ సైకిళ్ళ సోషల్ మీడియా హ్యాండిళ్ళ పై రియల్-టైమ్ లో దేశం నలుమూలల నుండి రైడర్ స్టోరీలను షేర్ చేయటం జరిగింది.
జావా, యోజ్ డీ మరియు BSA రైడింగ్ కమ్యూనిటీల నొమాడ్స్ కు రిపబ్లిక్ డే రైడ్స్ ఒక వార్షిక సాంప్రదాయం. ఈ ఏడాది ప్రత్యేకతలు – నొమాడ్స్ మరింత ఎక్కువ సంఖ్యలో, మరింత సమీకృతంగా హాజరు కావటం, స్వతంత్ర కమ్యూనిటీలతో లోతైన సహకారం, ఏడాది పొడుగునా కమ్యూనిటీ రైడ్స్ కి మించి ఆ వడిని కొనసాగించేందుకు తయారు చేసిన నొమాడ్స్ ప్లాట్ ఫారంను ప్రారంభించటం.



