Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeఆటలుస్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థుల వర్గీకరణ

స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థుల వర్గీకరణ

- Advertisement -

– ప్రతిభావంతులకే అక్కడ శిక్షణ, విద్య
– క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌
: తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్స్‌ పతకాలు సాధించే కర్మాగారాలుగా తయారు కావాలని..అందుకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పాఠశాల విద్యార్థులను ప్రతిభ ఆధారంగా వర్గీకరణ (ఏ-ఎఫ్‌) చేసి…నైపుణ్యం లేని విద్యార్థులను ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌కు బదిలీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కీలక ఆదేశాలు జారీ చేశారు. స్పోర్ట్స్‌ స్కూల్స్‌, అకాడమీల్లో ప్రేరణాత్మక తరగతులు, వ్యక్తిత్వ వికాస అంశాల్లో శిక్షణ సహా యోగా శిక్షణ తప్పనిసరి చేయాలని.. క్రీడా పాఠశాలల పనితీరు పర్యవేక్షణకు సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్‌ విభాగం అధికారులను ఆదేశించారు. హకీంపేట్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో ఆధునాతన శిక్షణ, విద్యలో మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) చైర్మెన్‌ శివసేనా రెడ్డితో కలిసి వాకిటి శ్రీహరి శుక్రవారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్స్‌, అకాడమీలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img