Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కాలుష్య నివారణకు మట్టి వినాయకులను ఏర్పాటు చేయాలి 

కాలుష్య నివారణకు మట్టి వినాయకులను ఏర్పాటు చేయాలి 

- Advertisement -

– మండల విద్యాశాఖ అధికారి నర్సయ్య 
సుధా టెక్నో స్కూల్లో మట్టి వినాయకుల పంపిణీ 
నవతెలంగాణ-పాలకుర్తి : కాలుష్య నివారణకు మట్టి వినాయకులను ఏర్పాటు చేసి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించుకోవాలని మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య సూచించారు. సోమవారం మండలంలోని సుధాకర్ టెక్నో స్కూల్లో ఐ వి ఎఫ్, సుధా టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా మట్టి వినాయకులను బహుకరించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ కాలుష్యాన్ని నివారించేందుకు గత ఐదు సంవత్సరాలుగా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్  (ఐ వి ఎఫ్)  సుధా టెక్నో స్కూల్ సంయుక్తంగా మట్టి వినాయకులను తయారు చేపిస్తూ, ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. , విద్యార్థులకు ప్లాస్టిక్, ప్లాస్టర్ అఫ్ పారిస్, కెమికల్ కలర్స్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను కాకుండా మట్టి తో తయారు చేయడం ద్వారా, మనం ఉపయోగించే నీరు భూమి కలుషితం కాకుండా ఉంటుందని తెలిపారు. మట్టి వినాయకుల తయారీపై దృష్టి సాధించిన సుధా టెక్నో స్కూల్ యాజమాన్యాన్ని, ఆర్య వైశ్య సంఘాన్ని  అభినందించారు, రాగడి మట్టి తెప్పించి అందమైన వినాయక విగ్రహాలను చిన్న చిన్న పిల్లలతో చేపిస్తూ మట్టి వినాయకుల తయారీని ప్రోత్సహిస్తూన్నామని. ప్రకృతి సహజ సిద్ధంగా లభించే వాటి ద్వారా తయారు చేయడం వలన పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చునని తెలిపారు.  గణపతి మండపాల వద్ద మన సంస్కృతి ని ప్రతిబింభించేలాగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుధా టెక్నో స్కూల్ కరెస్పాండంట్,    ఐ వి ఎఫ్ జిల్లా కోశాధికారి  రాపాక విజయ్, ఉపాధ్యాయులు దిలీప్, శరత్, సురేష్, నరేష్, విజయ్, సతీష్, విజయ, సదాలక్ష్మి, శైలజ, మమత,అనిత, శిరీష, మౌనిక, రమ్య, నిర్మల, ఐ వి ఎఫ్ మండల బాధ్యులు బీజ్జల సోమన్న, ఆనంతుల వెంకటేశ్వర్లు, కొండా సునీల్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad