సేవ లో పాల్గొన్న కలెక్టర్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం అనంతారం గ్రామంలో స్వచ్ఛతా- హీ- సేవ 2025 స్వచ్ఛోత్సవ్ పక్షోత్సవాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలిసి మాట్లాడారు. గ్రామంలో ప్రజల సహకారం తో శ్రమదానాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ, వ్యర్థాల తొలగింపు , స్వచ్ఛ శ్రామికుల సంక్షేమ కార్యక్రమాల, పర్యావరణ హితమైన పండుగల నిర్వహణ చేపట్టాలన్నారు.
గ్రామస్థుల చేత స్వచ్ఛ గ్రామకోసం ప్రతిజ్ఞ చేయించారు. గ్రామస్థుల అందరూ తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే గ్రామస్థులు అందరూ ఆరోగ్యంగా ఉంటారని అప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గ్రామస్థుల తో కలిసి గ్రామంలో శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.