– రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు
– స్వచ్ఛందంగా బంద్ లో ఆర్టీసీ కార్మికులు
– ప్రతి నోట నినదించిన బీసీ నినాదం
– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, రాస్తారోకో
– ర్యాలీలో పాల్గొన్న సీపీఐఎం జిల్లా కార్యదర్శి పి యాదయ్య
– బీఆర్ఎస్ ర్యాలీలో జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి
– బంద్ లో భాగస్వాములైన వ్యాపారులు
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ ఇబ్రహీంపట్నంలో సక్సెస్ అయ్యింది. వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ రథచక్రాలు రోడ్డెక్కలేదు. ఆర్టీసీ కార్మికుల స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. బంధు సందర్భంగా సీపీఐఎం ఇబ్రహీంపట్నంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రస్తారోకో, మానవహారం నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఐఎం జిల్లా కార్యదర్శి యాదయ్య పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి నోట బీసీ నినాదం హోరెత్తింది. టిఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వైఖరిని ఎండగట్టారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. బీసీ సంఘాల నేతలు సీపీఐఎం నేతలతో కలిసి బందులో పాల్గొన్నారు. బీసీ బందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడంతో ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో కదలని ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు. కాగా, బస్సులు డిపోలకే పరిమితం కావడం వలన రాష్ట్ర వ్యాప్త బంద్ కు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. కాగా ఈ నేపథ్యంలో ఆర్టీసీ డిపో వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎప్పటికప్పుడు బందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి పర్యవేక్షించారు. ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులతో మాట్లాడారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ పరిధిలో జరిగిన బంద్ వివరాలను ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజును అడిగి తెలుసుకున్నారు.